![]() |
![]() |

తమిళ స్టార్ హీరో అజిత్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో పోల్చాడు 'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ. రేపు రిలీజవుతున్న అజిత్ మూవీ 'వలిమై'లో అతను విలన్‌గా కనిపించబోతున్నాడు. నాని సినిమా 'గ్యాంగ్ లీడర్'లో విలన్‌గా చేశాక, మళ్లీ అతను నెగటివ్ రోల్ చేసింది 'వలిమై'లోనే. హెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని బోనీ కపూర్ నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన ఆ సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కార్తికేయ, ‘‘2017లో నా 'ఆర్ఎక్స్ 100' రిలీజ్ కాలేదు. నేను, నా ఫ్రెండ్ కలిసి 'ఖాకి' సినిమా చూశాం. అప్పుడు ‘ఈ డైరెక్టర్ నాతో సినిమా చేస్తానంటే స్క్రిప్ట్ వినకుండానే ఒప్పుకుంటాను’ అని నా ఫ్రెండ్‌తో చెప్పాను. నిజంగా నేను అదృష్టవంతుడ్ని. మూడేళ్ల తర్వాత అదే డైరెక్టర్‌తో నాకు పని చేసే ఛాన్స్ వచ్చింది. వినోద్‌గారు చాలా కంఫర్ట్ ఇచ్చి నాతో వర్క్ చేయించుకున్నారు. ఆయన దర్శకత్వంలో అజిత్ సార్‌తో కలిసి పనిచేసే అవకాశం కలిగింది." అని చెప్పాడు.
అజిత్‌లో ఒక్క శాతం కూడా స్వార్థం ఉండదని తెలిపిన కార్తికేయ, "ఆయన జెన్యూన్ పర్సన్. నాకు ఈ సినిమా ప్లస్ కావాలని బలంగా కోరుకున్నారు. నా క్యారెక్టర్‌ను ఇంకా గొప్పగా చూపించాలని ఆయనే జాగ్రత్తలు తీసుకున్నారు. నన్ను ప్రమోట్ చేశారు. అంత గొప్ప హీరోతో రిలేషన్ దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫిబ్రవరి 24న మీ అందరికన్నా సినిమా కోసం నేనే ఎక్కువ వెయిట్ చేస్తున్నాను." అన్నాడు.
బోనీ కపూర్‌గారు మన అల్లుడని చెప్పిన అతను, "రెండేళ్ల పాటు అనేక సమస్యలను దాటి 'వలిమై' సినిమా చేశాం. ప్రతి సమస్యను దాటించడంలో మమ్మల్ని ముందుండి నడిపించారు. ఆయన ఎంత గొప్ప నిర్మాతో ఆయనతో పనిచేసిన తర్వాత అర్థమైంది. మేమెంతో ఇష్టపడే శ్రీదేవిగారి బ్యానర్‌లో పనిచేసే అవకాశం కలిగింది. చాలా గర్వంగా అనిపిస్తోంది. ఆయనతో కలిసి మళ్లీ పనిచేయాలని అనుకుంటున్నాను. హ్యూమా ఖురేషి అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. సినిమాలతో, పెర్ఫామెన్స్‌లతో సంబంధం లేని హీరోలు ఇక్కడ పవన్ కళ్యాణ్‌గారైతే, తమిళనాడులో అజిత్ గారు. ఇద్దరి సినిమాలు ఒకేసారి వస్తున్నాయి. కచ్చితంగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్. 24న 'వలిమై' చూడండి. 25న 'భీమ్లా నాయక్' చూడండి’’ అన్నాడు.
![]() |
![]() |