![]() |
![]() |

`ఇస్మార్ట్ శంకర్`లో డబుల్ ధిమాక్ పోరడిగానూ, `రెడ్`లో ట్విన్ బ్రదర్స్ గానూ `ఫస్ట్ టైమ్` ఎంటర్టైన్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. త్వరలో తొలిసారిగా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి రూపొందిస్తున్న `ద వారియర్` కోసం మొదటిసారిగా కాప్ అవతారమెత్తుతున్నాడు రామ్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రామ్ కి జంటగా కృతి శెట్టి దర్శనమివ్వనుండగా.. ఆది పినిశెట్టి, నదియా, అక్షర గౌడ, భారతీరాజా ఇతర ముఖ్య పాత్రలు ధరిస్తున్నారు.
.webp)
ఇదిలా ఉంటే, ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి తాజాగా రిలీజ్ డేట్ ని లాక్ చేశారట మేకర్స్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. జూలై 1న `ద వారియర్` థియేటర్స్ లో సందడి చేయనుందట. అదే గనుక నిజమైతే.. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన `ఇస్మార్ట్ శంకర్` తరువాత జూలై నెలలో రాబోతున్న తన సినిమా ఇదే అవుతుంది. మరి.. `ఇస్మార్ట్ శంకర్`లాగే `ద వారియర్` కూడా జూలై సెన్సేషన్ గా నిలుస్తుందేమో చూడాలి.
Also Read: రామ్ సినిమాలో చోప్రా భామ!?
కాగా, `ద వారియర్`కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
![]() |
![]() |