Home  »  News  »  హిందీ జాతీయ భాష చ‌ర్చ‌.. అజ‌య్ దేవ‌గ‌ణ్‌ది హాస్యాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌న!

Updated : Apr 28, 2022

 

'హిందీ జాతీయ భాష చర్చ'లో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి గురువారం ఉదయం వరుస ట్వీట్లలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హాస్యాస్ప‌దంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడంటూ నిందించారు. అజయ్ దేవగన్ 'స్వ‌భావ‌రీత్యా హైపర్ మాత్రమే కాద‌'నీ, జాతీయ భాషగా హిందీపై ఆయ‌న‌ అభిప్రాయాలు 'ఆయ‌న‌ హాస్యాస్పదమైన ప్రవర్తనను చూపించాయి' అని కుమార‌స్వామి చెప్పారు.

అజయ్ దేవగణ్‌ హిందీలో 'హిందీ ఇదిర‌కూ ఉంది, ఇప్పుడూ ఉంది, ఎల్లప్పుడూ మన‌ మాతృభాష మరియు జాతీయ భాషగా ఉంటుంది' అని ట్వీట్ చేసిన ఒక రోజు తర్వాత ఈ కామెంట్‌ వచ్చింది. సౌత్ స్టార్ కిచ్చా సుదీప్ కర్ణాటక త‌క్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో “హిందీ ఇక ఎంత‌మాత్రం జాతీయ భాష కాదు” అని వ్యాఖ్యానించడంపై దేవగణ్‌ స్పందించాడు.

సుదీప్‌కు మద్దతుగా, హెచ్‌డి కుమారస్వామి ట్వీట్ చేస్తూ “నటుడు కిచ్చా సుదీప్‌ హిందీ జాతీయ భాష కాదని చెప్పడం సరైనది. ఆయన స్టేట్‌మెంట్‌లో తప్పు వెతకడానికి ఏమీ లేదు. నటుడు అజయ్‌దేవ్‌గన్ స్వభావరీత్యా హైపర్‌గా ఉండటమే కాకుండా తన హాస్యాస్పదమైన ప్రవర్తనను కూడా చూపిస్తాడు." అన్నారు.

జనతాదళ్ (సెక్యులర్) నాయకుడైన కుమార‌స్వామి, "కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ లాగా, హిందీ కూడా భాషలలో ఒకటి. భారతదేశం అనేక భాషల ఉద్యానవనం. బహుళ సంస్కృతుల భూమి. దీనికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేయవద్దు." అని కూడా చెప్పారు. "ఒక దేశం, ఒకే పన్ను, ఒకే భాష, ఒకే ప్రభుత్వం" కోసం బిజెపికి అజయ్ దేవగణ్‌ మౌత్ పీస్ గా మారాడ‌ని కూడా ఆయన ఆరోపించారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.