![]() |
![]() |

ఇటీవల వచ్చిన 'బీస్ట్'లో టైటిల్‌కు తగ్గట్లు ఫుల్ యాక్షన్ మోడ్‌లో దర్శనమిచ్చిన విజయ్, తన నెక్ట్స్ మూవీని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రారంభించాడు. 'పుష్ప' హీరోయిన్ రష్మికా మందన్న ఈ మూవీలో విజయ్ జోడీగా నటిస్తోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకు తాత్కాలికంగా 'దళపతి 66' అని పిలుస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ మూవీలో విజయ్ ఫైట్లు చేయడంట. 'బీస్ట్'లో భయమంటే ఎరుగని 'రా' ఏజెంట్‌గా నటించి బీభత్సమైన ఫైట్లు చేసిన ఆయన దిల్ రాజు నిర్మిస్తోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో సరికొత్త పాత్రలో దర్శనమిస్తాడంట.
ఎమోషనల్ డ్రామాగా తయారవుతున్న 'దళపతి 66'లో విజయ్ 90ల నాటి రూపంలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల లిస్టును ఇప్పటికే ప్రకటించారు. అందులో స్టంట్ మాస్టర్ ఎవరనేది ప్రకటించలేదు. దాన్ని బట్టి కూడా ఇందులో ఫైట్లు లేవనే అభిప్రాయానికి బలం చేకూరుతోంది.
రెండు వారాల క్రితం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. చెన్నైలో ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న టీమ్, వచ్చే వారం నుంచి ఓ పెద్ద షెడ్యూల్‌ను ప్రారంభించనున్నది. ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనున్నది. శరత్‌కుమార్, శ్యామ్ మరో రెండు కీలక పాత్రలు చేస్తున్నారు. విజయ్ అన్నయ్యగా శ్యామ్ కనిపిస్తాడని ఓ ప్రచారం జరుగుతోంది.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే పాటలకు బాణీలు కూర్చే పనిలో ఉన్నాడు. హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ తర్వాత మూడో షెడ్యూల్‌ను చెన్నైలో జరుపనున్నారు. ఇప్పటికే దీని కోసం ఓ భారీ సెట్‌ను నిర్మించారు. అక్కడ ఓ పాట కూడా తీస్తారని వినికిడి.
![]() |
![]() |