![]() |
![]() |

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె నటించిన 'ధాకడ్' చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న కంగనా.. టాలీవుడ్ నటుడు, 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణుకి స్పెషల్ థాంక్స్ చెప్పడం విశేషం.
నేడు బుద్ధ పూర్ణిమ కావడంతో 'ధాకడ్' చిత్ర నిర్మాత దీపక్ ముఖత్, ఆయన సతీమణి కృష్ణ ముఖత్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు కంగనా తెలిపారు. అలాగే ఈ సందర్భంగా ఆమె మంచు విష్ణు, ఏవీ ధర్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు.. తిరుమలలో విశ్రాంతికి కూడా వారు ప్రత్యేక ఏర్పాట్లు చేయించినట్లు తెలుస్తోంది.

రజనీష్ ఘయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న 'ధాకడ్'లో ఏజెంట్ అగ్ని పాత్రలో కంగనా నటించింది. 'తలైవి' తర్వాత కంగనా నటించిన సినిమా ఇదే. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా ఏజెంట్ అగ్నిగా ఎలా అలరిస్తుందో చూడాలి.
![]() |
![]() |