![]() |
![]() |

ఒకవైపు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటిస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల చిత్రాల్లోనూ సందడి చేస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అయితే, ఎటొచ్చి రీసెంట్ టైమ్స్ లో నయన్ ఖాతాలో సాలిడ్ హిట్ లేదనే చెప్పాలి.
ఇదిలా ఉంటే, కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి నయన్ నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అన్నీ ఓటీటీ బాటలోనే వెళుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. 2020లో `మూక్కుత్తి అమ్మన్` (తెలుగులో `అమ్మోరు తల్లి`)తో ఎంటర్టైన్ చేసిన నయనతార.. 2021లో `నేట్రిక్కన్`తో పలకరించింది. ప్రధానంగా తమిళంలో రూపొందిన ఈ రెండు నాయికా ప్రాధాన్య చిత్రాలు కూడా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ `డిస్నీ ప్లస్ హాట్ స్టార్`లో నేరుగా వినోదాలు పంచాయి. కట్ చేస్తే.. ఈ సంవత్సరం కూడా నయన్ నుంచి మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ వస్తుండగా.. అది కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనే స్ట్రీమ్ కానుంది. `O2` పేరుతో రూపొందిన ఈ కోలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ లో ఎనిమిదేళ్ళ పిల్లాడికి తల్లిగా అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతోంది నయన్. త్వరలోనే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా స్ట్రీమ్ కానుంది. మరి.. వరుసగా మూడో ఏడాది కూడా సేమ్ ఓటీటీలో సందడి చేయనున్న నయన్.. ఈ సారి ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
![]() |
![]() |