![]() |
![]() |

ఈ క్యాలెండర్ ఇయర్ లో తక్కువ గ్యాప్ లోనే రెండు ఆసక్తికరమైన చిత్రాలతో సందడి చేయనున్నాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. ఆగస్టు 25న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `లైగర్` విడుదల కానుండగా.. డిసెంబర్ 23న శివ నిర్వాణ నిర్దేశకత్వంలో తయారవుతున్న పాన్ - సౌత్ ఇండియా మూవీ `ఖుషి` తెరపైకి రానుంది.
ఇదిలా ఉంటే, `లైగర్` తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `జన గణ మన` పేరుతో విజయ్ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ సరసన `బుట్టబొమ్మ` పూజా హెగ్డే కథానాయికగా నటించబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. జూలై నుంచి `జన గణ మన` తాలూకు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఆపై చకచకా చిత్రీకరణ జరిపి మార్చి నెలాఖరుకల్లా ఫినిష్ చేసేలా పూరి ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు.. వచ్చే ఏడాది వేసవిలో `జన గణ మన`ని రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట పూరి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |