![]() |
![]() |

తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ అభిమానులకు చేదు వార్త. కుర్రకారు హృదయాలకు గాయం చేస్తూ ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఆమె త్వరలో ఇల్లాలు కాబోతున్నారు. ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్‌మేన్ గౌతమ్‌తో కాజల్ అగర్వాల్ ఏడడుగులు వేయబోతున్నారు. వీళ్లిద్దరిదీ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని సమాచారం. పెళ్లి గురించి ఇరువురి కుటుంబాలు మాట్లాడుకున్నాయని టాక్. త్వరలో ముంబైలోని ఐదు నక్షత్రాల హోటల్‌లో పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేశారని సమాచారం. కాజల్‌కి 35 సంవత్సరాలు వచ్చాయి. లేటు వయసులో పెళ్లి చేసుకుంటున్న కథానాయికల జాబితాలో ఆమె చేరుతున్నారు. కాజల్ కంటే ముందు ఆమె చెల్లెలు నిషా పెళ్లి చేసుకుని ఓ పిల్లాడికి జన్మనిచ్చింది.
కరోనాతో చిత్రీకరణలకు విరామం రావడంతో హీరోలు రానా దగ్గుబాటి, నితిన్, నిఖిల్ పెళ్లిల్లు చేసుకున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’లో ఓ కథానాయికగా నటించిన శాలినీ వడ్నికత్తి కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే, కరోనా తర్వాత పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాజల్ అగర్వాల్ అని చెప్పుకోవాలి.
![]() |
![]() |