Home  »  News  »  హీరోలు లేకుండా 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ మొదలు!?

Updated : Oct 5, 2020

యావత్ భారతీయ సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' ఒకటి. యుంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నేడు భాగ్య నగరంలో పునఃప్రారంభించారు. రెండు నెలల పాటు ఏకధాటిగా చిత్రీకరణ కొనసాగిస్తారని తెలిసింది. అయితే, హీరోలు ఇద్దరూ లేకుండా ఈ రోజు చిత్రీకరణ ప్రారంభించారని సమాచారం.

ఎన్టీఆర్ అతి త్వరలో 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది. రామ్ చరణ్ షూటింగులో జాయిన్ అవ్వడానికి కొంత సమయం పడుతుందట. 'ఆచార్య'లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసి 'ఆర్ఆర్ఆర్' సెట్స్ కి చరణ్ వస్తారని టాక్. ఆయన సరసన నటిస్తున్న ఆలియా భట్ వచ్చే నెలలో షూటింగుకు వస్తారట. ఈసారి చిత్రీకరణ మొత్తం పూర్తయిన తరవాత విడుదల తేదీ ప్రకటించాలని రాజమౌళి నిర్ణయించుకున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్, శ్రియ ప్రత్యేక పాత్రల్లో సందడి చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన విదేశీ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.