![]() |
![]() |

నటి మేఘనా రాజ్ తన సీమంతం ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. ఈ పిక్చరల్లో ఆమె పక్కనే దివంగతుడైన ఆమె భర్త చిరంజీవి సర్జా కూడా ఉండటం విశేషం! అవును. సీమంతం వేడుక కోసం చిరంజీవి నిలువెత్తు కటౌట్‌ను తయారు చేసి, మేఘన పక్కనే దానిని నిలబెట్టారు. ఈ వేడుకలో మేఘన కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు పాల్గొన్నారు.
ఆదివారం ఈ పిక్చర్లను మేఘన షేర్ చేశాక ఆన్‌లైన్‌లో అవి వైరల్‌గా మారాయి. ఆమె ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు వేలాది మెసేజ్‌లతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సీమంతం కోసం మేఘన ముదురాకు పచ్చ, గులాబీ రంగు కాంబినేషన్ చీర ధరించి ఆకట్టుకున్నారు. పర్పుల్ కలర్ సూట్ ధరించినట్లున్న చిరంజీవి సర్జా నిలువెత్తు కటౌట్ చూస్తుంటే, ఆయన ఎప్పటికీ మేఘనతోటే ఉన్నారనే అభిప్రాయం కలుగుతోంది.
"నాకు అత్యంత ప్రత్యేకమైన ఇద్దరు.. ఇదే కదా నువ్వు కోరుకుంది చిరు.. నువ్వు కోరుకున్న విధంగానే జరిగింది.. ఎప్పటికీ, ఎన్నటికీ! ఐ లవ్ యూ బేబీ మా" అని ఆ పిక్చర్లకు క్యాప్షన్ పెట్టారు మేఘన. ఇది చూసి అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.

గ్రూప్ ఫొటోలో మేఘన మరిది ధ్రువ జర్జా, అతని భార్య ప్రేరణా శంకర్, ఇతర కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. కొన్ని వారాల క్రితం ఆమె కవల పిల్లలను కన్నదంటూ ప్రచారంలోకి వచ్చింది. ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అవి వదంతులంటూ ఖండించిన ఆమె, వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జూన్ 9న తీవ్ర గుండెపోటుతో చిరంజీవి సర్జా ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలు. ఆయన మరణించే సమయానికి మేఘన మూడు నెలల గర్భిణి. మరో రెండు నెలలకు ఆమె తన తొలి బిడ్డకు జన్మనివ్వనున్నారు.
.jpg)
![]() |
![]() |