![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని నటించిన తాజాగా చిత్రం 'హాయ్ నాన్న'. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే క్లాస్ సినిమా కావడంతో నాని స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టలేకపోయింది. అయినప్పటికీ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, కుటుంబ ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తుండటంతో వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. మొదటి రోజుతో పోలిస్తే మూడో రోజు కలెక్షన్లు ఎక్కువ రాగా, ఇక నాలుగో రోజు కలెక్షన్స్ కళ్ళు చెదిరేలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.2.91 కోట్ల షేర్, రెండో రోజు రూ.2.04 కోట్ల షేర్, మూడో రోజు రూ.3.80 కోట్ల షేర్ రాబట్టిన హాయ్ నాన్న మూవీ.. నాలుగో రోజు రూ.4.16 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి నాలుగు రోజుల్లో రూ.12.91 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.2.40 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.5.80 కోట్ల షేర్ కలిపి.. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.21.11 కోట్ల షేర్ రాబట్టింది.
వరల్డ్ వైడ్ గా రూ.27.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన హాయ్ నాన్న.. మొదటి రోజు రూ.5.51 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.54 కోట్ల షేర్, మూడో రోజు రూ.5.70 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.6.36 కోట్ల షేర్ తో.. నాలుగు రోజుల్లో 75 శాతానికి పైగా రికవర్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.7 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. డిసెంబర్ 22 వరకు భారీ సినిమాల విడుదల లేకపోవడంతో.. హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
![]() |
![]() |