![]() |
![]() |

బేబి సినిమాతో ఆ సినిమాలో నటించిన హీరోలు, హీరోయిన్, డైరెక్టర్ ఎంత ఫేమస్ అయ్యారో నిర్మాత ఎస్ కేఎన్ కూడా అంతే ఫేమస్ అయ్యాడు.అలాగే ఆ సినిమాతో ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల తర్వాత సరికొత్త ట్రెండ్ కి కూడా క్రియేట్ చేసాడు. తాజాగా ఆయన ఫిలింఛాంబర్ లో ఒక సినిమా టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. ఇప్పుడు ఆయన ఛాంబర్ లో ఒక సినిమా టైటిల్ ని రిజిస్టర్ చేయించారు.ఇప్పుడు ఈ వార్త టాక్ అఫ్ ది తెలుగు ఇండస్ట్రీ అయ్యింది.
ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ కల్ట్ బొమ్మ అనే కొత్త టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు. కాకపోతే ఆయన ఏ సినిమా కోసం ఈ పేరు రిజిస్ట్రేషన్ చేయించాడో తెలియదు. ప్రస్తుతం సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా ఒక సినిమా, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా మరో సినిమాని ఆయన నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి.
ఒక వేళ ఈ రెండు సినిమాల తో సంబంధం లేకుండా కల్ట్ బొమ్మ టైటిల్ తో మరేదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడేమో చూడాలి. బేబీ మూవీ ప్రమోషన్స్ లో అలాగే విజయోత్సవాల్లో కల్ట్ బ్లాక్ బస్టర్, కల్ట్ బొమ్మ అనే పదాలని తరుచుగా వాడి ఆ పదాలు ఆడియెన్స్ నోట్లో నానేలా చేసిన ఎస్ కే ఎన్ ఇప్పుడు అదే టైటిల్ తో సినిమా చేస్తుండటం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
![]() |
![]() |