![]() |
![]() |

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయగుండం అయిన తీరం దాటి తగ్గుముఖం పడుతుందేమో గాని యానిమల్ కలెక్షన్స్ మాత్రం ఇప్పుడప్పుడే తగ్గేలా లేవు.యానిమల్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటికి పది రోజులు కావస్తోంది. కానీ ఎక్కడ కూడా యానిమల్ కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. లేటెస్ట్ గా ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ ల లెక్కలు సినీ ట్రేడ్ వర్గాల వారిని విస్మయపరుస్తున్నాయి.
డిసెంబర్ 1 న విడుదల అయిన యానిమల్ విడుదల రోజు నుంచే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ ని సృష్టిస్తు ముందుకు దూసుకుపోతుంది. ఇప్పడు ఇంకో సరికొత్త రికార్డుని యానిమల్ తన ఖాతాలో వేసుకుంది. 10 రోజులకి 717 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ గా అక్షరాలా 717 .46 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇప్పుడు ఈ ఫిగర్ తో ఎన్టీఆర్ తన సినిమాలో ఇది దయా గాడి దండయాత్ర అని చెప్పినట్టు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు యానిమల్ దండయాత్ర చేస్తుంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ రష్మిక హీరో హీరోయిన్లు గా వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు చూస్తున్నంత సేపు కూడా ఒక కొత్త రకం మూవీని చూస్తున్నామని భావిస్తుండబట్టే యానిమల్ మూవీకి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయని ఇండియన్ సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
![]() |
![]() |