![]() |
![]() |

ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టి 'సలార్'పై ఉంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 'సీజ్ ఫైర్' డిసెంబర్ 22న విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ చిత్ర నిడివి ఆసక్తికరంగా మారింది.
కొన్ని భారీ సినిమాలు మూడు గంటల నిడివి ఉండటం సహజం. అయితే రెండు భాగాలుగా వచ్చే సినిమాలు మాత్రం.. ఒక్కో భాగం రెండున్నర గంటల నుంచి 2 గంటల 45 నిమిషాల లోపు నిడివి కలిగి ఉంటాయి. కానీ సలార్ మొదటి భాగమే దాదాపు మూడు గంటల నిడివి ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ఫస్ట్ పార్ట్ ని 2 గంటల 55 నిమిషాల నిడివితో లాక్ చేశాడని సమాచారం. ఇది 'బాహుబలి' ఫ్రాంచైజ్, 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ సినిమాల నిడివి కంటే ఎక్కువ కావడం విశేషం. సినిమాలో కంటెంట్ ఉంటే నిడివి అనేది సమస్య కాదు. మరి బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ బిగ్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితులు కథగా వస్తున్న సలార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
![]() |
![]() |