![]() |
![]() |

ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీరే వేరు. ఆ మధ్య కుటుంబ కథా చిత్రం అత్తారింటికి దారేదితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్.. ఈ సంవత్సరం అల వైకుంఠపురములో రూపంలో నాన్ - బాహుబలి రికార్డ్ వశం చేసుకున్నారు. అంతేకాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి బౌన్స్ బ్యాక్ ఫిల్మ్ అందించారు. తన శైలి రాతతో, తీతతో కుటుంబ ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించారు. 2020లో డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు.
ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయి వసూళ్ళను ఆర్జించిన త్రివిక్రమ్ డైరెక్టోరియల్ అల వైకుంఠపురములో.. ఈ ఏడాది సినిమాల పరంగా మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలచింది. బన్నీ, త్రివిక్రమ్, పూజా హెగ్డే, తమన్ తో పాటు గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలకూ కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ని అందించింది. వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా టీఆర్పీ రేటింగ్స్ పరంగా అల వైకుంఠపురములో రికార్డులు సృష్టించింది. ఇక పాటలతోనూ యూ ట్యూబ్ ముంగిట హవా చాటుకుంది.
![]() |
![]() |