![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ కార్తి.. వరుసగా మూడు నెలల పాటు నెలకో సినిమాతో పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టులో `విరుమన్`, సెప్టెంబర్ లో `పొన్నియన్ సెల్వన్ః 1`, అక్టోబర్ లో `సర్దార్` చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు కార్తి. ప్రధానంగా తమిళంలో రూపొందిన ఈ సినిమాలన్నీ.. తెలుగులోనూ అనువాద రూపంలో అలరించబోతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది కార్తి నుంచి రాబోతున్న ఈ మూడు చిత్రాలకి సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే.. ఇవన్నీ కూడా పండగలను టార్గెట్ చేసుకుని వినోదాలు పంచనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ముత్తయ్య డైరెక్టోరియల్ `విరుమన్` వినాయక చవితి స్పెషల్ గా ఆగస్టు 31న రిలీజ్ కానుంది. ఇక లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఎపిక్ పిరియడ్ డ్రామా `పొన్నియన్ సెల్వన్ః 1` దసరా స్పెషల్ గా సెప్టెంబర్ 30న విడుదల కానుంది. అలాగే, పి.ఎస్. మిత్రన్ డైరెక్ట్ చేస్తున్న `సర్దార్`.. దీపావళి కానుకగా అక్టోబర్ 21న తెరపైకి రాబోతోంది. మరి.. పండగలనే టార్గెట్ చేసుకుని జనం ముందుకు వస్తున్న ఈ చిత్రత్రయాలతో.. కార్తి ఏ స్థాయి విజయాలను అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |