![]() |
![]() |

షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన 'క్లాస్ ఆఫ్ 83' ఫిల్మ్ ఆగస్ట్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలవుతోంది. అతుల్ సభర్వాల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో బాబీ డియోల్ తొలిసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఈ మూవీలో విజయ్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్‌గా బాబీ డియోల్ కనిపించనున్నాడు.
హుస్సేన్ జైదీ రచించిన ద 'క్లాస్ ఆఫ్ 83' బుక్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హీరోగా అందరూ కొనియాడే విజయ్ సింగ్ అనే పోలీస్ అధికారిని పనిష్‌మెంట్ కింద పోలీస్ అకాడమీ డీన్‌గా నియమిస్తే ఆయన ఏం చేశాడనేది ఈ చిత్ర కథ. విజు షా మ్యూజిక్, మారియో పోల్జాక్ సినిమాటోగ్రఫీ అందించారు. 'బార్డ్ ఆఫ్ బ్లడ్', 'బేతాళ్' వెబ్ సిరీస్ తర్వాత రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్ కాంబినేషన్‌లో వస్తోన్న థర్డ్ వెంచర్ 'క్లాస్ ఆఫ్ 83'.

![]() |
![]() |