![]() |
![]() |

వరుణ్ తేజ్ సరసన 'లోఫర్' సినిమాలో హీరోయిన్‌గా నటించిన దిశా పాట్నీ గుర్తుందా? ఆమె తండ్రికి కరోనా సోకింది. అలాగే, ఆయనతో పాటు మరో ఇద్దరు అధికారులు కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు.
దిశా తండ్రి జగదీశ్ ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ విభాగంలో విజిలెన్స్ యూనిట్ డిప్యూటీ ఎస్పీగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ట్రాన్సఫార్మర్ కుంభకోణానికి సంబంధించి ఆయన విచారణ చేస్తున్నారు. లక్నో నుండి బరేలికి వెళ్ళినప్పుడో, బరేలి నుండి లక్నోకి వచ్చినప్పుడో జగదీశ్ సహా మరో ఇద్దరు అధికారులకు కరోనా బారిన పడ్డారు. దాంతో ఆఫీసు 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు.

ఇప్పుడు దిశా పాట్నీ హిందీలో సినిమాలు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ 'భారత్', టైగర్ ష్రాఫ్ 'బాఘీ 2'లో నటించింది. ప్రస్తుతం సల్మాన్ 'రాధే మోస్ట్ వాంటెడ్ భాయ్'తో పాటు మరో హిందీ సినిమా ఆమె చేతిలో ఉంది.
![]() |
![]() |