![]() |
![]() |

ఈ సంక్రాంతికి స్టార్స్ నటించిన 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలు బరిలో ఉన్నప్పటికీ.. కుర్ర హీరో తేజ సజ్జాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాదు ఈ సినిమా 'సైంధవ్', 'నా సామి రంగ' చిత్రాల కంటే ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ చేసి ఆశ్చర్యపరుస్తోంది.
జనవరి 12న 'హనుమాన్', జనవరి 13న 'సైంధవ్', జనవరి 14న 'నా సామి రంగ' విడుదల కానున్నాయి. వీటిలో 'హనుమాన్' మూవీ వరల్డ్ వైడ్ గా రూ.26.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా, 'సైంధవ్' రూ.25 కోట్ల బిజినెస్ చేసింది. ఇక 'నా సామి రంగ' రూ.18.20 కోట్ల బిజినెస్ తో సరిపెట్టుకుంది. వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ల సినిమాల కంటే హనుమాన్ ఎక్కువ బిజినెస్ చేయడం నిజంగా విశేషమే. విడుదలకు ముందు బిజినెస్ పరంగా సత్తా చాటిన హనుమాన్.. విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఇక 'హనుమాన్'తో పాటు జనవరి 12న విడుదలవుతున్న 'గుంటూరు కారం' మూవీ వరల్డ్ వైడ్ గా రూ.132 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.
![]() |
![]() |