![]() |
![]() |
.webp)
పవన్ కళ్యాణ్ (pawan kalyan) చేస్తున్న మూడు సినిమాల్లో ఓజి (og)కూడా ఒకటి. ఇటీవలే కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకున్న ఓజి మీద పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఓజీ గ్లింప్స్ తో అభిమానుల అంచనాలు తారా స్థాయికి వెళ్లాయి. దీంతో ఫ్యాన్స్ రోజు ఓ జి అప్ డేట్ కోసం ఎదురుచూడటం పరిపాటి అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఒక అప్ డేట్ అభిమానులని ఆనందంలో ముంచెత్తడమే కాకుండా ఈ సంక్రాంతికి ఒక శుభవార్తని చెప్పింది.
ఓజి కి సంబంధించిన బిజినెస్ ని మేకర్స్ స్టార్ట్ చేసారు. ఈ మేరకు అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్టుగా ఫిలిం వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మేకర్స్ నుంచి అధికారకంగా ఎలాంటి ప్రకటనలు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న ఓజి బిజినెస్ న్యూస్ అయితే అభిమానుల్లో జోష్ నింపుతుంది. అలాగే దసరాకి ఎట్టి పరిస్థితులోను మూవీని థియేటర్స్ లోకి తీసుకురావాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు.

పవన్ సరసన ప్రియాంక మోహన్( priyanaka mohan) హీరోయిన్ గా నటిస్తున్న ఓజి లో సలార్ (salaar)ఫేమ్ శ్రీయ రెడ్డి (sriya reddy) తో పాటు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ(imran hashmi) లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ (thaman)సంగీతం వహిస్తుండగా డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
![]() |
![]() |