![]() |
![]() |
సూపర్‌స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చినబాబు నిర్మిస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌ను కూడా ముమ్మరం చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ‘కుర్చీని మడతపెట్టి..’ అంటూ ఓ మాస్ డాన్స్ సింగిల్‌ను లిరికల్ వీడియోగా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఎంతో పాపులర్ అయిన కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్‌తో ఈ పాటను రూపొందించడం జరిగింది. షేక్ మహ్మద్ పాషా అలియాస్ కుర్చీతాత వాయిస్‌తో చెప్పిన ఒరిజనల్ డైలాగ్‌తోనే పాటను రూపొందించారు. ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా, తమన్ మంచి మాస్ బీట్‌తో కంపోజ్ చేశారు. సాహితి చాగంటి, శ్రీకృష్ణ ఈ పాటను ఎంతో హుషారుగా ఆలపించారు. ఇక సినిమాలో శేఖర్ మాస్టర్ ఈ పాటకు స్టెప్స్‌ను కంపోజ్ చేశారు.
ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ‘ధమ్ మసాలా’, ‘ఓ మై బేబీ’ సాంగ్స్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. త్రివిక్రమ్ గత సినిమాలతో పోలిస్తే తమన్ ఈ సినిమాకి మంచి పాటలు చెయ్యలేదన్న విమర్శ ఉన్న నేపథ్యంలో ఈరోజు విడుదలైన ‘కుర్చీ మడతపెట్టి’ వాటికి ఫుల్‌స్టాప్ పెట్టే అవకాశం ఉంది. మంచి ఫాస్ట్ బీట్‌తో సాగే ఈ పాటలో అక్కడక్కడ మహేష్, శ్రీలీల వేసిన స్టెప్స్ అద్భుతంగా అనిపిస్తాయి. ఇద్దరూ పోటాపోటీగా ఈ పాటకు స్టెప్పులేశారు.
![]() |
![]() |