![]() |
![]() |
ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన నందమూరి కళ్యాణ్‌రామ్ కొత్త సినిమా ‘డెవిల్’. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది సినిమా అద్భుతంగా ఉంది అంటుంటే.. మరికొంతమంది అంతలేదు అంటున్నారు. ఇంకొంతమంది కళ్యాణ్‌రామ్ క్యారెక్టర్ ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్ క్యారెక్టర్‌ను పోలి ఉందని చెబుతున్నారు. మరి ఇలాంటి స్సందన వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మొదటి రోజు ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం.
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.1.78 కోట్లు కలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. సినిమాకి అంత హైప్ వచ్చినప్పటికీ మొదటిరోజు ‘బింబిసార’ కంటే చాలా తక్కువ కలెక్షన్ వచ్చింది. ‘బింబిసార’ చిత్రం మొదటిరోజు రూ.6.30 కోట్లకుపైగా కలెక్షన్ సాధించింది. ఆ సినిమాతో పోలిస్తే ‘డెవిల్’ నథింగ్ అనే చెప్పాలి. ఇక అంతకుముందు కళ్యాణ్‌రామ్ చేసిన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
డెవిల్ రూ.1.78 కోట్లు
అమిగోస్ రూ.2.03 కోట్లు
బింబిసార రూ.6.30 కోట్లు
ఎంత మంచివాడవురా రూ. 2.20 కోట్లు
118 రూ.1.60 కోట్లు
నా నువ్వే రూ.0.75 కోట్లు
ఇజమ్ రూ.3.09 కోట్లు
పై లెక్కలను పరిశీలిస్తే ‘డెవిల్’ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. కళ్యాణ్‌రామ్ గత చిత్రాల కంటే డెవిల్ బడ్జెట్ ఎక్కువ. అయినా కలెక్షన్లు చూస్తే ఆ ఊపు కనిపించడం లేదు. ఇప్పుడు వీకెండ్ ప్లస్ కొత్త సంవత్సరం.. మరి ఇది డెవిల్‌కి ఎంతవరకు ప్లస్ అవుతుందనేది చూడాలి.
![]() |
![]() |