![]() |
![]() |

కృష్ణకుమార్ కున్నాత్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ కేకే అంటే మాత్రం సంగీత ప్రపంచంలో అందరికీ సుపరిచితమే. ఈయన హఠాన్మరణం జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఆయన అన్ని భారతీయ భాషల్లో పాటలు పాడారు. దేశంలో బెస్ట్ సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. మూడు దశాబ్దాలుగా ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు కేకే. కోల్ కతాలోని నజ్రుల్ మంచా వివేకానంద కాలేజీలో జరిగిన ఫెస్ట్ లో పాటలు పాడిన కేకే ఆ షో తర్వాత ది గ్రాండ్ హోటల్ కి వెళ్లారు. అక్కడ ఆయనకు సడన్గా హార్ట్ అటాక్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
"కేకే గా పేరు తెచ్చుకున్న ఫేమస్ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం ఎంతో విచారం కలిగిస్తోంది. ఆయన పాటల్లో ఎన్నో అద్భుతమైన భావోద్వేగాలు పలుకుతాయి. అన్ని వయసుల వారిని ఆయన పాటలు అలరిస్తాయి. అందరి మనసులను తాకుతాయి. ఆయన సంగీత ప్రపంచానికి వదిలెళ్లిన పాటల ద్వారా మనం ఆయన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి " అంటూ ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు.
కేకే ఆగస్టు 23, 1968 లో పుట్టారు. ఢిల్లీలోని మలయాళీ ఫామిలీ వీళ్లది. సి.ఎస్.నాయర్, కున్నత్ కనకవల్లి అమ్మానాన్నలు. ఢిల్లీలోని మౌంట్ సెయింట్ మేరీస్ స్కూల్లో తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న కిరోరి మాల్ కాలేజీలో చదువుకున్నారు. 1996 నుంచి ఆయన గాయకుడిగా తెలుగులో ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు.
సంతోషం మూవీలో "దేవుడే దిగి వచ్చిన ", గుడుంబా శంకర్ లో "లే లే లేలే" సాంగ్, ఆర్య లో "ఫీల్ మై లవ్ " జల్సా లో " మై హార్ట్ ఈజ్ బీటింగ్ " 7g బృందావన్ కాలనీ లో "తలచి తలచి" సాంగ్, టక్కరి దొంగ లో " అలెబా అలెబా " అనే పాట పాడారు. ఇలా చెప్పుకుంటూపొతే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ పాడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
'హమ్ దిల్ దే చుకే సనమ్' మూవీలో కేకే పాడిన 'తడప్ తడప్' సాంగ్ రిలీజ్ అయ్యింది. ఐతే దీని కంటే ముందు ఆయన కొన్ని పాటలు పాడారు కానీ అవి అంత హిట్ కాలేదు. ఈ 'తడప్ తడప్' సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసరికి ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ సాంగ్ కేకే జీవితాన్నే మార్చేసింది. అప్పటినుంచి ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్ని హిట్ సాంగ్స్ పాడినా పెద్దగా ఏ అవార్డులు ఆయన్ని వరించలేదు. అవార్డులతో పనిలేదు ప్రేక్షకుల మనసులను రజింపచేస్తే చాలు అదే పెద్ద అవార్డు అంటూ ఎన్నో ఇంటర్వూస్ లో ఆయన చెప్పేవారు. కేకే తన చిన్ననాటి స్నేహితురాలైన జ్యోతి కృష్ణను వివాహం చేసుకున్నారు.
![]() |
![]() |