![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎనర్జీ ఓ అంటువ్యాధి లాంటిదని దర్శకుడు శ్రీరామ్ వేణు అంటున్నాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న అందరికీ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. పవన్ కథానాయకుడిగా బాలీవుడ్ హిట్ 'పింక్'ను తెలుగులో 'వకీల్ సాబ్'గా శ్రీరామ్ వేణు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ షట్‌డౌన్ కావడంతో ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగింది. మళ్లీ ఎప్పుడు షూటింగులు మొదలైతే అప్పుడు సెట్స్ మీదకు వెళ్లాలని చూస్తున్నారు. కరోనా రాకముందు చాలావరకు సినిమా తీశారు. పవన్‌తో షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుతూ ఆయన ఎనర్జీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సైతం ప్రవహిస్తుందని శ్రీరామ్ వేణు చెప్పారు.
"జనవరిలో సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. విజయవాడలో పవన్ గారికి అంతకు ముందే డిసైడ్ అయిన పొలిటికల్ కమిట్‌మెంట్స్ ఉన్నాయి. సో... ఆయన విజయవాడ టు హెదరాబాద్, ప్రతిరోజూ 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసేవారు. 22 రోజులు అదే విధంగా చేశారు. పగలు ట్రావెల్ చేసి, నైట్ షూటింగ్ చేసేవారు. అయినా ఆయన ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలనే ఆయన నిర్ణయం మా యూనిట్ అందరినీ ముందుకు నడిపింది" అని శ్రీరామ్ వేణు అన్నారు. ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ కావడం కోసమే ఫిమేల్ సెంట్రిక్ సినిమాకి 'వకీల్ సాబ్' అని టైటిల్ పెట్టామనీ, సినిమా చూశాక ఆ టైటిల్ విషయంలో అందరూ కన్విన్స్ అవుతారని దర్శకుడు చెబుతున్నారు.
![]() |
![]() |