![]() |
![]() |

"మా ఇల్లు ఐసీయూ లాగా ఉంటుంది" అని దర్శకధీరుడు రాజమౌళి అన్నారు. దాని అర్థం... ఆయన ఇంట్లో అత్యవసర వైద్య చికిత్సకు అవసరమయ్యే పరికరాలు, ఇతరత్రా వస్తువులతో నిండి పోయిందని కాదు. శుభ్రత, పరిశుభ్రత విషయంలో తమ ఇల్లు ఐసియూలా ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చారు.
భారతీయ సినిమా చలన చిత్ర చరిత్రలో వసూళ్ళ రికార్డులు సృష్టించి, అగ్రస్థానం కైవసం చేసుకున్న 'బాహుబలి 2' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్స. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పనులకు కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ బ్రేకులు వేసింది. అందువల్ల రాజమౌళి ఇంట్లోనే ఉంటున్నారు. మరి, 'ఇంటి పనులు ఏమైనా చేస్తున్నారా?' అని ఆయనను అడిగితే తన భార్య రమ పాటించే శుభ్రత గురించి చెప్పుకొచ్చారు.
"మా ఆవిడ చెప్పినట్టు ఇల్లు క్లీన్ చేయడం పెద్ద ఛాలెంజ్. అంతకు మించిన పెద్ద పని మరొకటి ఉండదు. ఒక విధంగా మా ఇల్లు ఐసీయూలా ఉంటుంది" అని రాజమౌళి అన్నారు.
![]() |
![]() |