![]() |
![]() |

హీరోయిన్లు రెజీనా, నివేదా థామస్ అర్ధరాత్రి పూట ఒక వ్యక్తిని పట్టుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంత కష్టమైనా అతడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ, ఆ అతడు ఎవరు? అంటే నవీన్ చంద్ర. వాళ్లిద్దరికీ విలన్ అతడే. సౌత్ కొరియాలో సూపర్ డూపర్ హిట్టైన సినిమా 'మిడ్ నైట్ రన్నర్స్'. తెలుగులో దర్శకుడు సుధీర్ వర్మ రీమేక్ చేస్తున్నారు. రెజీనా, నివేదా థామస్ మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్నారన్నది పాత విషయమే, అందరికీ తెలిసిందే. కొత్త విషయం ఏంటంటే... ఈ సినిమాలో విలన్ క్యారెక్టరుకు నవీన్ చంద్రను తీసుకున్నారు.
అమ్మాయిల అపహరణ, అవయవాల అక్రమరవాణా అంశాల నేపథ్యంలో 'మిడ్ నైట్ రన్నర్స్' కథ సాగుతుంది. సౌత్ కొరియా సినిమా నుండి మెయిన్ పాయింట్ తీసుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్టు సుధీర్ వర్మ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. రెజీనా, నివేదా పోలీసులుగా.... వాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించే విలన్ గా నవీన్ చంద్ర తెరపై కనిపించనున్నారు. ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లతో నవీన్ చంద్ర సినిమాలు చేశారు. 'ఎవరు'లో రెజీనాతో కలిసి అతడు నటిస్తే... 'రోమియో జూలియట్'లో అతడి సరసన నివేదా థామస్ హీరోయిన్ గా నటించారు. కరోనా లేకపోతే ఈపాటికి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేదే.

![]() |
![]() |