![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో హీరో గోపీచంద్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. సాధారణ రోజుల్లో అప్పుడప్పుడు వీరిద్దరూ కలుస్తుంటారు. ఇప్పుడు కుదరడం లేదు. కరోనా కారణంగా లాక్ డౌన్ వచ్చి పడడంతో ఎవరి ఇళ్లకు వారు పరిమితమయ్యారు. అయితే... ఇరువురూ ఫోనులో పలకరించుకుంటూ, క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. కరోనా తీవ్రత పెరుగుతున్న సమయంలోనే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా చిత్రీకరణ కోసం ప్రభాస్ జార్జియా వెళ్లారు. అప్పుడు స్నేహితుడికి గోపీచంద్ జాగ్రత్తలు చెప్పారు.
"కరోనా ప్రభావం మొదలవుతున్న సమయంలో ప్రభాస్ జార్జియా వెళ్ళాడు. పరిస్థితులు బాలేదని 'అక్కడ అలా ఉందట, ఇక్కడ ఇలా ఉందిరా.. జాగ్రత్తగా ఉండు' అని అతడికి సందేశాలు పంపుతూ ఉండేవాణ్ణి. 'ఏం పర్లేదురా' అని రిప్లై ఇచ్చేవాడు. ఇప్పటి వరకు బాగానే ఉందని చెబుతూ ఉండేవాడు. ఒకరోజు 'మేం తిరిగి వచ్చేస్తున్నాం' అని చెప్పాడు. ఇండియా వచ్చాక 14 రోజులు క్వారంటైన్ లో ఉన్నాడు" అని గోపీచంద్ చెప్పారు.
లాక్ డౌన్ వల్ల పిల్లలతో సమయం గడపడానికి చక్కటి అవకాశం దొరికిందని గోపీచంద్ అన్నారు. అదే సమయంలో పిల్లల్ని కంట్రోల్ చేయడం పెద్ద పనే అని తెలిపారు.
![]() |
![]() |