![]() |
![]() |

గీతా ఆర్ట్స్ కాంపౌండ్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'గా అక్కినేని అఖిల్‌ను విజయదశమికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుందా? తీసుకొచ్చే సన్నాహాలు చేస్తుందా? ప్రస్తుతానికి ఆ దిశగా ఆలోచిస్తున్నారు. అయితే... కరోనా వ్యాప్తి ఏ మేరకు తగ్గుముఖం పట్టింది? అనేదానిపై ఈ ఆలోచనలు ఎంతవరకు ఆచరణలోకి వస్తాయనేది ఆధారపడి ఉంటుంది.
'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. నిజానికి ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఏడాది ప్రారంభంలో చకచకా షూటింగ్ చేశారు. షూటింగ్ స్పీడుకు కరోనా బ్రేకులు వేసింది. ఇంకా 30 రోజులు షూటింగ్ బ్యాలన్స్ ఉందట.
లాక్ డౌన్ ముగిసిన తర్వాత వెంటనే షూటింగులు మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ ఆగస్టులో షూటింగులు మొదలైనా... దసరాకి విడుదల చేయవచ్చని ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. షూటింగ్ చేసినంత వరకు ఎడిటింగ్, కొంత రీ రికార్డింగ్ కూడా పూర్తి చేశారట. ఏదైనా కరోనా మీద ఆధారపడి ఉంది. పలు సినిమా యూనిట్స్ ప్లానింగులను కరోనా అల్లకల్లోలం చేసింది.
![]() |
![]() |