![]() |
![]() |

అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు.. ఇలా చిన్న చిత్రాలతో కెరీర్ ని ప్రారంభించిన టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. మలయాళంలో ఘనవిజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుండగా.. మరో స్టార్ హీరో కాంబినేషన్ లోనూ సాగర్ చంద్ర ఆఫర్ అందుకున్నాడట.
ఆ వివరాల్లోకి వెళితే.. 14 రీల్స్ సంస్థ నటసింహ నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. లెజెండ్(2014) తరువాత బాలయ్యతో 14 రీల్స్ చేయబోయే ఈ చిత్రానికి దర్శకుడిగా సాగర్ చంద్ర పేరునే పరిశీలిస్తున్నారట. వాస్తవానికి ఈ సంస్థలో వరుణ్ తేజ్ హీరోగా సాగర్ చంద్ర ఓ ప్రాజెక్ట్ చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదు. దానికి బదులుగా సాగర్ చంద్రకి ఈ అవకాశం దక్కిందని టాక్. త్వరలోనే బాలయ్య, సాగర్ చంద్ర కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. అదయ్యాక బి. గోపాల్ కాంబినేషన్ మూవీ, ఆపై సంతోష్ శ్రీనివాస్ తో మరో ప్రాజెక్ట్ చేస్తారని టాక్.
![]() |
![]() |