![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రాఘవగా ప్రభాస్ దర్శనమివ్వనుండగా.. జానకిగా కృతి సనన్, లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన `ఆదిపురుష్`.. చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా, సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో ఓం రౌత్ రెండు సినిమాలు తీర్చిదిద్దగా.. ఆయా చిత్రాలు వేర్వేరు సంవత్సరాల్లో జనవరి ప్రథమార్ధంలోనే జనం ముందు నిలిచాయి. ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకుడిగా ఓం రౌత్ తొలి ప్రయత్నమైన మరాఠి చిత్రం `లోక్ మాన్య` 2015 జనవరి 2న విడుదలై విజయం సాధించింది. అలాగే, రెండో చిత్రమైన `తానాజీ` (హిందీ) 2020 జనవరి 10న రిలీజై ఆ ఏడాది బాలీవుడ్ హయ్యస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా రికార్డులకెక్కింది. మరి.. `ఆదిపురుష్`తో ముచ్చటగా మూడోసారి కూడా జనవరి నెలలోనే వస్తున్న ఓం రౌత్.. సెంటిమెంట్ కలిసొచ్చి హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |