![]() |
![]() |
.jpg)
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా 'దిల్ బేచారా' ఆదరణ పరంగా, రేటింగ్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ సినిమాకు ఫ్యాన్స్ నుంచి వచ్చిన అమోఘమైన మద్దతుతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీపై రిలీజైన కొద్ది సేపటికే ఐఎండీబీ రేటింగ్స్‌లో 10 పాయింట్లను తాకి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం 49 వేల ఓట్ల తర్వాత 9.8 రేటింగ్‌తో టాప్‌లో కొనసాగుతోంది. ఐఎండీబీ టాప్ రేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్‌లో కమల్ హాసన్, మాధవన్ కాంబినేషన్‌లో వచ్చిన తమిళ ఫిల్మ్ అన్బే శివమ్‌ను వెనక్కు నెట్టి అగ్ర స్థానాన్ని ఆక్రమించింది.
థైరాయిడ్ కేన్సర్‌తో బాధపడుతూ కొద్ది రోజుల జీవితాన్నే కలిగి ఉన్న కిజీ బసు అనే యువతి, ఆ తరహా నేపథ్యంతో ఉన్న ఇమ్మాన్యుయేల్ రాజ్‌కుమార్ జూనియర్ అలియాస్ మానీ అనే యువకుడి మధ్య నడిచే అందమైన ప్రేమకథతో ముఖేశ్ చాబ్రా డైరెక్ట్ చేసిన 'దిల్ బేచారా' మూవీ సుశాంత్‌సింగ్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. కథ హీరోయిన్ క్యారెక్టర్ వైపు నుంచి నడిచినా, మానీ పాత్రలో సుశాంత్ ప్రదర్శించిన ఎనర్జీ, పర్ఫార్మెన్స్ అందరినీ అలరిస్తున్నాయి. కిజీ క్యారెక్టర్‌లో కొత్తమ్మాయి సంజనా సంఘీ కూడా బాగా రాణించింది. క్లైమాక్స్ అయితే అందరి మనసుల్నీ తడి చేస్తోంది.
![]() |
![]() |