![]() |
![]() |
.jpg)
సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన 'లింగా'లో అనుష్క నటించారు. అజిత్‌తో 'ఎన్నై ఆరిందాల్' చేశారు. చియాన్ విక్రమ్ సరసన 'తాండవం'లో, 'దైవ తిరుమగళ్' చిత్రాలలో నటించారు. సూర్య 'సింగమ్' సిరీస్ చిత్రాలు గురించి సపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్, మాధవన్ సరసన సైతం అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ నటించారు. తమిళంలో స్టార్ హీరోలతో నటించిన అనుష్క, తొలిసారి విజయ్ సేతుపతి సరసన నటించనున్నారని సమాచారం.
విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు ఏఎల్ విజయ్ ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో విజయ్ తెరకెక్కిస్తున్న జయలలిత బయోపిక్ 'తలైవి' పూర్తయిన తరవాత ఈ సినిమా ఉంటుందట. ఇందులో కథానాయికగా అనుష్కను తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తమిళంలో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో 'తాండవం', 'దైవ తిరుమగళ్' సినిమాల్లో అనుష్క నటించారు. దర్శకుడు ఫిలిం మేకింగ్ స్టయిల్ ఆమెకు తెలుసు. పైగా, అతడితో మంచి ర్యాపో ఉంది. అందువల్ల, ఈ సినిమాకు ఎస్ చెప్పే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయని చెన్నై టాక్.
![]() |
![]() |