![]() |
![]() |

రామ్‌గోపాల్ వర్మపై సీనియర్ లిరిక్ రైటర్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఓ పాటతో కసి తీర్చుకున్నారు. గతంలో ఆ ఇద్దరి మధ్యా పెద్ద జగడం చోటు చేసుకున్న విషయం విదితమే. ఆర్జీవీ తన సినిమాల ద్వారా సంస్కృతిని నాశనం చేస్తున్నాడంటూ జొన్నవిత్తుల ఆక్రోశిస్తే, ఆయనను కించపరుస్తూ ఆర్జీవీ ట్వీట్లు చేశారు. దాంతో ఆర్జీవీపై సినిమా తీస్తానని అప్పుడే ప్రతిన చేశారు జొన్నవిత్తుల. అయితే సినిమా సరిపోదనుకున్నారేమో 'ఆర్‌జీవీ.. రోజూ గిల్లే వాడు' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.
లేటెస్ట్‌గా అందులో ఓ పాటను రిలీజ్ చేశారు. ఆర్జీవీ తన గురించి తానే చెప్పుకుంటున్నట్లు ఆ పాటను అల్లారు. దీన్ని బయోపోయెమ్ అనొచ్చు. అందులో ప్రతి పాదం చివరా "నా కొడుకుని" అనే మాట తగిలించారు. "ఓడ్కా మీద ఒట్టు నే బాడ్కోవ్ నా కొడ్కుని" అని ఆ పాట మొదలవుతుంది. మోరల్సు లేని మొండి నా కొడుకుని.. బాలెన్సు లేని బండ నా కొడుకుని.. సామాజిక స్పృహ, దేశభక్తి లేని చవట నా కొడుకునీ.. ఏ రోజు కారోజు శాడిస్టు పోస్టుల వరస్టు నా కొడుకునీ.. లోకం మొత్తం బూతులు తిట్టే లోఫర్ నా కొడుకునీ లాంటి లైన్లు ఆ పాటలో ఉన్నాయి. అయితే పాట చివర మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. అమ్మా అని ఆర్జీవీ వేదనగా అమ్మను తలుచుకున్నట్లు లైన్ రాశారు.
ఇంత ఎఫెక్టివ్‌గా, ఇంత రైమింగ్‌గా ఏనాడూ ఆర్జీవీ తన సినిమాల్లో పాటలు రాయించుకోలేకపోయాడు. కానీ ఆయన మీద మాత్రం జొన్నవిత్తుల తన కలాన్ని ఝళిపించారు. ప్రతి లైన్‌లో తనని తానే ఆర్జీవీ తిట్టుకుంటున్నట్లు భలేగా రాశారు. ఆయన మనసు గ్రహించినట్లే వీణాపాణి చక్కని బాణీలతో ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ పాటను ఆర్జీవీ యాంటీ ఫ్యాన్స్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ సాంగ్ వైరల్ అవుతోంది.
ఆ పాట పూర్తి పాఠం చూడండి...
"ఓడ్కా మీద ఒట్టు నే బాడ్కోవ్ నా కొడ్కుని
ఈ ఓడ్కా మీద ఒట్టు నేన్ మూర్ఖపు నా కొడ్కుని
కొంతమందికి పిచ్చి నా కొడుకుని
ఇంకొంతమందికి మాయ నా కొడుకుని
మోరల్సు లేని మొండి నా కొడుకుని
బాలెన్సు లేని బండ నా కొడుకుని
నాకు నేనే.. నాకు నేనే.. దొంగ నా కొడుకునీ...
||ఓడ్కా మీద ఒట్టు||
చట్టాన్ని, న్యాయాన్ని చీటింగు చేసే తొండి నా కొడుకునీ
సామాజిక స్పృహ, దేశభక్తి లేని చవట నా కొడుకునీ
||చట్టాన్ని న్యాయాన్ని||
పబ్లిసిటి కోసం పెంటపూసుకునే మెంటల్ నా కొడుకునీ
సెలబ్రిటీలపై బురదని చల్లే సెల్ఫిష్ నా కొడుకునీ
ఎన్నేళ్లకైనా రవ్వంత మారని ఎదవ నా కొడుకునీ
ఏ రోజు కారోజు శాడిస్టు పోస్టుల వరస్టు నా కొడుకునీ
||ఓడ్కా మీద ఒట్టు||
బేడార్ధణాతో బ్యాడ్ ఫిలిమ్స్ తీసే బేవార్సు నా కొడుకునీ
లోకం మొత్తం బూతులు తిట్టే లోఫర్ నా కొడుకునీ
||బేడార్ధణాతో బ్యాడ్ ఫిలిమ్స్||
చచ్చినా సరే అర్థం కాని సైకో నా కొడుకునీ
లైఫుకి అర్థం తెలియని లకలకల నా కొడుకునీ
నన్ను నేనే నాశనం చేసుకుని నవ్వుకునే నా కొడుకునీ
నన్ను నేనే నాశనం చేసుకుని నట్టు లూజు నా కొడుకునీ
ఎంత చేసినా...
ఒక్క మా అమ్మకి మాత్రమే మంచి కొడుకుని
అమ్మా..!"
![]() |
![]() |