![]() |
![]() |
.jpg)
సుకుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన '1.. నేనొక్కడినే' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ పరంగా ఆశించిన విజయం సాధించలేదు. కానీ, తరవాత కాలంలో కల్ట్ క్లాసిక్ అనిపించుకుంది. ఆ తరవాత మహేష్, సుక్కు కాంబినేషన్లో సినిమా అనుకున్నప్పటికీ... కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. అయితే, సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఓ సినిమా చేయవచ్చని ఫిలింనగర్ సమాచారం.
కరోనా అడ్డుపడకపోతే సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన 'వి' ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ప్రస్తుతం ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబు, ఇటీవల సుకుమార్ దగ్గర పలు చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగాలలో పని చేసిన అర్జున్ చెప్పిన కథకు ఓకే చెప్పారట. ఏకే ఎంటెర్టైనెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనీ, 'వి' తరవాత సుధీర్ బాబు అంగీకరించిన సినిమాలు పూర్తయిన తరవాత ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం.
![]() |
![]() |