![]() |
![]() |

ఆగస్టు నెలాఖరున నాగార్జున పుట్టినరోజు. అక్కినేని అభిమానులకు పండగ రోజు. ఈ ఏడాది పండగను మరింత సందడిగా చేయడానికి అఖిల్ అక్కినేని రెడీ అవుతున్నాడని టాక్. హీరోల పుట్టినరోజులకు, వాళ్ళు నటిస్తున్న కొత్త సినిమా నుండి ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల కావడం కామన్. మహేష్ బాబు అయితే తన తండ్రి కృష్ణ పుట్టినరోజుకు కూడా తన సినిమా నుండి ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తారు. అఖిల్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారట.
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. కరోనా రక్కసి కోరలు చాచి తన ప్రతాపం చూపిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని సినిమాలతో పాటు ఈ సీఎంగా షూటింగ్ కూడా ఆగింది. లేదంటే ఈపాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అఖిల్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పుడు నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీఏ2 బ్యానర్ మీద బన్నీ వాసు, వాసు వర్మ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.
![]() |
![]() |