![]() |
![]() |

హీరో నాగశౌర్య కుటుంబానికి చెందిన రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న పేకాట దందాపై స్పెషల్ ఆపరేషన్ పోలీసులు (SOT) ఆదివారం రాత్రి దాడిచేసి, జూదం ఆడుతున్న పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. లక్షల రూపాయల నగదును, కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో గుత్తా సుమంత్ ఈ ఫామ్‌హౌస్‌లోనే కాకుండా హైదరాబాద్ శివార్లలోని పలు ఫామ్‌హౌస్‌లలో ఇదే రకమైన పేకాట దందాను నిర్వహిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిసింది.
ప్రతి ఫామ్‌హౌస్‌కు ఒక్కో వాట్సాప్ గ్రూప్ పెట్టి, వాటి ద్వారా సుమంత్ ఈ దందాను నిర్వహిస్తున్నాడు. ఒక్కో గ్రూప్‌లో వంద నుంచి రెండు వందల మంది దాకా జూదగాళ్లు ఉన్నట్లు సమాచారం. వీళ్లంతా బాగా డబ్బున్నవాళ్లే. వారిలో వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో వారం రోజులుగా జోరుగా జూదం జరుగుతున్నట్లు వెల్లడైంది. జూదగాళ్లకు మద్యం, ఆహారం కూడా సర్వ్ చేస్తున్నారు.
షంషాబాద్, షామీర్‌పేట ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లను కూడా సుమంత్ ఇదే తరహా జూద కేంద్రాలుగా మార్చినట్లు పోలీసుల విచారణలో తేలిందంటున్నారు. తమ ఫామ్‌హౌస్‌ను ఒక జూదకేంద్రంగా సుమంత్ మార్చిన విషయమై నాగశౌర్య కుటుంబం స్పందన ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఈ ఫామ్‌హౌస్ లీజుదారునిగా నాగశౌర్య తండ్రి శంకర్‌ప్రసాద్ ఉండటంతో ఆయనకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.
![]() |
![]() |