![]() |
![]() |

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'పుష్పక విమానం'. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడులైంది.
'పుష్పక విమానం' సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో గవర్నమెంట్ టీచర్ స్కూల్ పాత్రలో ఆనంద్ కనిపిస్తున్నాడు. పెళ్లి అయిన కొన్నిరోజులకే భార్య వదిలేసి వెళ్ళిపోవడంతో.. ఆ విషయాన్ని జనాలకు తెలియకుండా మేనేజ్ చేసే పాత్రలో కనిపించిన ఆనంద్ ట్రైలర్ లో నవ్వులు పూయిస్తున్నాడు. ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా ట్రైలర్ కామెడీ టచ్ తో మెప్పిస్తోంది. ట్రైలర్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది.
గత ఏడాది 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాతో ఆకట్టుకున్న ఆనంద్.. 'పుష్పక విమానం' సినిమాతో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
![]() |
![]() |