![]() |
![]() |

ఈ దీపావళికి తమిళనాట `అణ్ణాత్త`గా, తెలుగునాట `పెద్దన్న`గా పలకరించబోతున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. కమర్షియల్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ `శౌర్యం` శివ రూపొందించిన ఈ సినిమా.. పాటలతో, ప్రచార చిత్రాలతో జనాన్ని బాగా ఆకర్షిస్తోంది. దీపావళి సీజన్‌లో చాన్నాళ్ళ తరువాత సూపర్‌స్టార్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారనే పాజిటివ్ వైబ్స్ కూడా ఈ సినిమాకి వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తమిళులకు `అణ్ణాత్త`కి సంబంధించి రజినీకాంత్ కాకుండా ఉన్న మరో ప్రధాన ఆకర్షణ ఏంటంటే గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కడసారిగా ఆలపించిన గీతం ఇందులో ఉండడం. ``అణ్ణాత్త అణ్ణాత్త`` అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన గానామృతంతో ఈ ఇంట్రో సాంగ్‌ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్ళారు బాలు.
అయితే, తెలుగు వెర్షన్ పాడే సమయానికి బాలు మన ముందు లేకపోవడంతో.. ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌తో ఈ పాటని పాడింశారు మేకర్స్. ``అన్నయ్య అన్నయ్య`` అంటూ సాగే తెలుగు వెర్షన్ ఇంట్రో సాంగ్‌కి తన వంతుగా న్యాయం చేసి.. బాలుని గుర్తు చేశారు చరణ్. మొత్తమ్మీద.. అక్కడ బాలు - ఇక్కడ చరణ్ అన్నట్లుగా రజినీకాంత్ ఇంట్రోసాంగ్ ఉండడం బహుశా ఇదే మొదటి, చివరిసారి..
కాగా, `పెద్దన్న`లో రజినీకాంత్ కి చెల్లెలుగా కీర్తి సురేశ్ కనిపించనుండగా.. నయనతార నాయికగా, మీనా - ఖుష్బూ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. డి. ఇమాన్ ఈ చిత్రానికి స్వరకర్త.
![]() |
![]() |