![]() |
![]() |

జనసేనాని కాకముందు `కెమెరామెన్ గంగతో రాంబాబు`(2012) అనే పొలిటికల్ డ్రామా చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2012లో వచ్చిన సదరు పూరీ జగన్నాథ్ డైరెక్టోరియల్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ ఫలితం అందుకుంది. ఆ సినిమా తరువాత మళ్ళీ పొలిటికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ జోలికి వెళ్ళని పవన్.. త్వరలో ఆ తరహా సినిమాతో మరోసారి జనం ముందుకు రాబోతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `గబ్బర్ సింగ్` (2012) వంటి సంచలన చిత్రం తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `భవదీయుడు..! భగత్ సింగ్` అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. కాగా, దిల్లీ నేపథ్యంలో సాగే ఈ సినిమా హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందనుందని వినికిడి. ఇందులో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో పవన్ దర్శనమివ్వనున్నారని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `భవదీయుడు..! భగత్ సింగ్`కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు. ఇందులో పవన్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటించనుందని బజ్.
![]() |
![]() |