![]() |
![]() |

దర్శకుడు మారుతి సినిమా అంటేనే పసందైన వినోదానికి చిరునామా. తొలి చిత్రం `ఈ రోజుల్లో` నుంచి తనది ఇదే శైలి. కాగా, `ప్రతి రోజూ పండగే` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత `మంచి రోజులు వచ్చాయి` అంటూ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పలకరించబోతున్నారీ టాలెంటెడ్ డైరెక్టర్. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పండగ సీజన్ లో వచ్చిన మారుతి చిత్రాల్లో సింహభాగం విజయం సాధించినవే. 2012 ఉగాదికి `ఈ రోజుల్లో`, అదే ఏడాది దీపావళికి `బస్ స్టాప్`.. 2017 విజయదశమికి `మహానుభావుడు`.. 2019 క్రిస్మస్ సీజన్ లో `ప్రతి రోజూ పండగే`.. ఇలా ఫెస్టివల్ సీజన్ లో వచ్చిన మారుతి డైరెక్టోరియల్స్ చాలా మటుకు సక్సెస్ అయ్యాయి. మరి.. ప్రచార చిత్రాలతో ఇంప్రెస్ చేస్తున్న `మంచి రోజులు వచ్చాయి` కూడా అదే బాటలో పయనించి.. ఈ దీపావళి సీజన్ లో హిట్ బొమ్మగా నిలుస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా `పక్కా కమర్షియల్` మూవీ చేస్తున్న మారుతి.. సదరు కోర్ట్ డ్రామాని కూడా ఫెస్టివల్ రిలీజ్ గానే ప్లాన్ చేస్తున్నారని బజ్.
![]() |
![]() |