![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారు? ఎటువంటి సినిమా చేస్తారు? అందులో హీరో ఎవరు? ఇప్పటినుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలు అన్నిటికి రాజమౌళి సమాధానం ఇచ్చారు. సూపర్‌స్టార్ మహేష్బాబుతోటే సినిమా అని మరోసారి స్పష్టం చేశారు.
"ఇప్పటికి కొన్ని వందలసార్లు చెప్పాను. డీవీవీ దానయ్యగారితో సినిమా (ఆర్ఆర్ఆర్) అయిన తర్వాత కె.ఎల్. నారాయణగారితో చేయాలి... నాది, మహేష్ బాబుగారిది కాంబినేషన్ అని ఎప్పటి నుండో చెబుతున్నదే" అని రాజమౌళి స్పష్టం చేశారు. సో... మహేష్ హీరోగా 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి సినిమా పక్కా అన్నమాట.
లాక్ డౌన్ వల్ల ఖాళీ సమయం దొరకడంతో వీడియో కాల్స్‌లో తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్... అన్నయ్య, సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి కొత్త ఐడియాల మీద వర్క్ చేస్తున్నామని రాజమౌళి తెలిపారు. బహుశా.. ఆ ఐడియాలు మహేష్ బాబు సినిమా కోసం కావచ్చు.
![]() |
![]() |