![]() |
![]() |

సాధారణంగా తన భార్య దేహం గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక చీరేస్తానని అంటాడు ఎవడైనా. కానీ శ్రియ భర్త ఆండ్రీ కొశ్చీవ్ తీరే వేరు. అతను మాత్రం దాన్ని స్పోర్టివ్‌గా తీసుకుంటాడు. అవునా! అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ. లేటెస్ట్గా శ్రియ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆమె ఫ్యాన్స్‌తో భార్యాభర్తలిద్దరూ ఇంటరాక్ట్ అయ్యారు. ఒక ఫ్యాన్ శ్రియ వక్షస్థలం గురించి అభ్యంతరకరంగా కామెంట్ చేశాడు. దీన్ని ఆండ్రీ తేలిగ్గా తీసుకున్నాడు. "మీతో ఏకీభవిస్తున్నాను. చెప్పండి, ఆమె బాడీ గురించి మరిన్ని కామెంట్లు చెయ్యండి" అని ప్రోత్సహించి, ఆశ్చర్యపరిచాడు.
శ్రియ, ఆండ్రీ ప్రస్తుతం స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉంటున్నారు. ఇటీవల ఆండ్రీకి కరోనా వైరస్ సోకిన లక్షణాలు కనిపించడంతో కంగారుపడ్డారు. దాంతో ఒకే ఇంట్లో భౌతిక దూరం పాటిస్తూ ఇద్దరూ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇప్పుడు ఆండ్రీ సాధారణ స్థితికి వచ్చేశాడు. అతను రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త కూడా. క్వారంటైన్ డేస్‌లో ఇంట్లో ఉండాల్సి రావడంతో తరచూ తమ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది శ్రియ.
![]() |
![]() |