![]() |
![]() |

విజయ్ సేతుపతి చేస్తాడంటారా? అని మెగాస్టార్ చిరంజీవి సైతం అనుమానం వ్యక్తం చేశారట! 'సైరా నరసింహారెడ్డి'లో అతడు పోషించిన పాత్ర గురించి కాదు. 'ఉప్పెన' చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్ర గురించి!
మెగాస్టార్ మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అతడు కథ రాసేటప్పుడు విలన్ పాత్రలో విజయ్ సేతుపతి ఊహించుకుని రాశారట. అదే విషయం చిరంజీవిగారితో చెప్పినప్పుడు... అతడు చేస్తాడా? అని సందేహం వ్యక్తం చేశారట. అయితే... సానా బుచ్చిబాబు కథ చెప్పడం అతని ఒప్పుకోవడం జరిగాయి.
"కథ వినడానికి ముందు పాజిటివ్ క్యారెక్టరా? నెగిటివ్ క్యారెక్టరా? అని విజయ్ సేతుపతి అడిగారు. నేను నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పాను. 'సరే కథ చెప్పు' అన్నారు. కథ విన్నాక... 'చాలా బాడ్ రోల్' అన్నారు. కాసేపు ఆగిన తర్వాత '96' కన్నా మంచి కథ అని మెచ్చుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత దేశమంతా మాట్లాడుకుంటుంది అని చెప్పారు. సినిమా చేస్తున్నానని నాకు అభయం ఇచ్చారు" అని దర్శకుడు సానా బుచ్చిబాబు చెప్పారు.
![]() |
![]() |