![]() |
![]() |

హీరో నిఖిల్ తనను కుక్కతో పోల్చి చేసిన ట్వీట్‌పై రామ్‌గోపాల్ వర్మ స్పందించాడు. అతనిది బానిస మనస్తత్వమని వ్యాఖ్యానించాడు. బుధవారం ఉదయం ఆర్జీవీ 'పవర్ స్టార్' ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైరికల్‌గా ఆ మూవీని ఆర్జీవీ తీశాడు. అందులో హీరోకి 'ప్రవన్ కల్యాణ్' అనే పేరు పెట్టాడు. దాన్ని బట్టే ఆ సినిమా ఎవరి మీద తీశాడో అర్థమైపోతుంది.
ఇది ఇండస్ట్రీలోని పవన్ కల్యాణ్ అభిమానుల్ని తీవ్రంగా బాధించింది. నిఖిల్ అయితే తన అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోయాడు. "శిఖరంని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తలతిప్పి చూడదు.. మీకు అర్థం అయ్యిందిగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్" అని ట్వీట్ చేశాడు.
"పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, నిఖిల్ లాంటి యాక్టర్లు విదూషకులు. వాళ్లది బానిస మనస్తత్వం. పవన్ కల్యాణ్‌ను ఇంప్రెస్ చేయడానికి ఇలా మాట్లాడుతుంటారు. యాక్టర్ కానీ, సాధారణ అభిమాని కానీ.. ఇలాంటి బానిసలు ఒకే విధంగా ఉంటారు" అని ఒక చానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆర్జీవీ. అంతే కాదు.. నిఖిల్ ఎవరో తనకు తెలీదని కూడా అన్నాడు.
![]() |
![]() |