![]() |
![]() |

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయనున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో నాయికగా దీపికా పడుకోనే నటించనున్నదనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పట్నుంచీ ఆమె రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ విరివిగా నడుస్తోంది. దీపిక రావడంతో ఈ సినిమా స్థాయి రెట్టింపయ్యిందంటూ ఓ వర్గం ప్రచారం సాగిస్తోంది. తద్వారా ప్రభాస్ ఇమేజ్‌ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోంది. దీని వెనుక బాలీవుడ్ మీడియా ఉన్నదంటూ విమర్శలు వస్తున్నాయి.
ఇవాళ బాలీవుడ్‌లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ దీపిక అనే విషయంలో సందేహం లేదు. అయితే సినిమాను బట్టి ఆమె రెమ్యూనరేషన్ విషయంలో పట్టు విడుపులు చూపిస్తోంది. కమర్షియల్ మూవీస్‌కు ఎక్కువగానూ, 'పికు', 'ఛపాక్' వంటి కంటెంట్ బేస్ట్ మూవీస్‌కు కాస్త తక్కువగానూ ఆమె పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ రకంగా చూస్తే వైజయంతీ మూవీస్ నిర్మించ తలపెట్టిన సైన్స్ ఫిక్షన్ సినిమాకు ఆమె మాగ్జిమమ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటిదాకా దీపిక అత్యధిక పారితోషికం రూ. 20 కోట్లు. ప్రభాస్ జోడీగా నటించడానికి ఆమె అంతే అందుకోనున్నదని వినిపిస్తోంది. కాదూ కూడదంటే.. మరో రూ. 5 కోట్లు అదనంగా తీసుకోవచ్చు. అంటే.. రూ. 25 కోట్లు. ఆ ప్రకారం చూసినా ప్రభాస్ అందుకుంటున్న రెమ్యూనరేషన్‌లో అది సగమే అవుతుంది. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ. 50 కోట్లు అనేది విశ్వసనీయ సమాచారం. బయట ప్రచారంలో ఉన్నట్లు అది.. రూ. 60 కోట్లో లేక రూ. 75 కోట్లో కాదు.
వచ్చే ఏడాది షూటింగ్ మొదలవనున్న ఈ సినిమాకు ఇప్పట్నుంచీ హ్యూజ్ హైప్ తీసుకురావడానికి నిర్మాత చలసాని అశ్వినీదత్ అండ్ కో ప్రయత్నిస్తున్నారు. తద్వారా ఆ మూవీ మార్కెట్ విలువ పెంచి, ఆదాయాన్ని సమకూర్చుకోవాలనేది వాళ్ల ప్లాన్. అందుకే ప్రభాస్, దీపిక జంటగా నటించడం భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప విషయాల్లో ఒకటిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
![]() |
![]() |