![]() |
![]() |

త్రిషకూ, వదంతులకూ అవినాభావ సంబంధం. ఇదివరలో పలువురు స్టార్లతో కలిసి ఆమె పేరు వినిపించింది. కానీ మూడు రోజులుగా త్రిష, శింబు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన ప్రచారం లాంటి ప్రచారం ఇదివరకు రాలేదు. 2015 జనవరిలో చెన్నైకు చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణ్యన్‌తో జరిగిన నిశ్చితార్ధాన్ని ఆమె రద్దు చేసుకుంది. ఆ తర్వాత రానాతో డేటింగ్ చేసింది. ఇప్పుడు రానా తన స్నేహితురాలు మిహీకా బజాజ్‌తో పెళ్లి ఖాయం చేసుకున్నాడు. దాంతో శింబును పెళ్లాడాలని త్రిష డిసైడ్ చేసుకున్నదంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. మరోవైపు శింబు సంగతి చాలామందికి తెలిసిందే. మన్మథ బాణాలు వదలడంలో ఘటికుడిగా పేరుపొందాడు.
పదేళ్ల క్రితం త్రిష, శింబు కలిసి 'విన్నైత్తాండి వరువాయ' (తెలుగులో సమంత, చైతన్య నటించిన 'ఏ మాయ చేశావే')లో జంటగా నటించారు. అదే ఇతివృత్తంతో లాక్‌డౌన్ టైమ్‌లో ఓ షార్ట్ ఫిల్మ్ కూడా వారు చేశారు. తాజాగా వారి పెళ్లికి ఇరు కుటుంబాలూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయనేది ప్రచారంలోకి వచ్చింది. గతంలో నయనతార, హన్సికలతో ప్రేమాయణం నడిపాడు శింబు. కానీ ఆ ఇద్దరూ అతనికి బ్రేకప్ చెప్పారు. హన్సికతో డేటింగ్ పెళ్లి వరకూ వచ్చింది కానీ, పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని శింబు కండిషన్ పెట్టడంతో, సినిమాలను వదలనంటూ, అతడిని వదులుకుంది హన్సిక.
కాగా, తమ పెళ్లి గురించి ఆన్‌లైన్‌లో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఇప్పటిదాకా త్రిష స్పందించలేదు. సాధారణంగా తనపై వచ్చిన రూమర్లకు వెంటనే రెస్పాండై, తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వాటిని ఖండించే ఆమె.. ఈసారి మౌనం పాటిస్తోంది. దాన్ని బట్టి త్రిష, శింబు పెళ్లి ప్రచారంలో నిజం ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.
![]() |
![]() |