![]() |
![]() |

తమిళ స్టార్ సూర్యకు నేటితో 45 సంవత్సరాలు నిండాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆయన లేటెస్ట్ ఫిల్మ్ 'ఆకాశం నీ హద్దురా' (సూరారై పొట్రు) విడుదలలో విపరీతమైన జాప్యం జరుగుతూ వస్తోంది. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ బయోపిక్‌గా రూపొందిన ఈ మూవీ ఓటీటీలో విడుదలవుతుందే ప్రచారం కూడా ఇటీవల జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా థియేటర్లలోనే విడుదల కానున్నది. కాకపోతే ఈ ఏడాది కాదు.. 2021 జనవరిలో!
'గురు' ఫేమ్ సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విలక్షణ నటుడు మోహన్‌బాబు ఓ కీలక పాత్ర చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్రంలో 'సర్వం' తాళమయం ఫేమ్ అపర్ణా బాలమురళి హీరోయిన్ రోల్ చేసింది. తెలుగులో 'ఎన్‌జీకే' మంచి పేరు తెచ్చినప్పటికీ, 'బందోబస్త్' డిజాస్టర్ కావడంతో సూర్య ఆశలన్నీ 'ఆకాశం నీ హద్దురా' చిత్రంపైనే ఉన్నాయి.
![]() |
![]() |