![]() |
![]() |

వరుస పాన్ ఇండియా మూవీస్ తో ముందుకు సాగుతున్నారు ప్రభాస్. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్టోరియల్.. ఇలా ఈ ఉప్పలపాటి హ్యాండ్సమ్ హీరో నుంచి రాబోతున్న కొత్త చిత్రాలన్నింటిదీ అదే బాట. మూడు వరుస సంవత్సరాల్లో ఈ నాలుగు చిత్రాలు సందడి చేయనున్నాయి. 2021 వేసవిలో 'రాధేశ్యామ్' విడుదల కానుండగా.. 2022 ఆరంభంలో 'సలార్', ఆగస్టు 11న 'ఆదిపురుష్' తెరపైకి రాబోతున్నాయి. ఇక 2023లో నాగ్ అశ్విన్ కాంబినేషన్ మూవీ జనం ముందుకు వస్తుందని టాక్.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఒకే ఏడాదిలో ప్రభాస్ రెండు సినిమాలతో పలకరించి పదమూడేళ్ళవుతోంది. అప్పుడెప్పుడో 2009లో చివరిసారిగా 'బిల్లా', 'ఏక్ నిరంజన్' చిత్రాలతో ఒకే క్యాలెండర్ ఇయర్ లో డబుల్ ధమాకా ఇచ్చారు ఈ 6 ఫీట్ ప్లస్ హైట్ స్టార్. కట్ చేస్తే.. 13 ఏళ్ళ అనంతరం మళ్ళీ 2022లో ఆ ఫీట్ ని రిపీట్ చేయబోతున్నారు. మరి.. 2009లోలాగే 2022లోనూ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తారేమో చూడాలి.
![]() |
![]() |