![]() |
![]() |

ట్విట్టర్‌లో సైఫ్ అలీఖాన్ పేరు శనివారం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓ వర్గం నెటిజన్లు ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ నుంచి ఆయనను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో రావణాసురుని పాత్రను సైఫ్ పోషించనున్నాడు. హిందువులు పవిత్రంగా భావించే రామాయణ గాథ ఆధారంగా రూపొందే ఈ సినిమాలో శ్రీరామునిగా ప్రభాస్ కనిపించనున్నాడు.
అయితే, లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'ఆదిపురుష్' చిత్రంలో రావణుడిని ఓ మానవత్వం ఉన్న వ్యక్తిగా చూపించనున్నారనీ, సీతపై ఆయన వ్యామోహాన్నీ, తన చెల్లెలు శూర్పణఖ విషయంలో చేసిన పనికి ప్రతీకారంగానే రామునితో ఆయన యుద్ధం చేస్తాడని తాము జస్టిఫై చేయనున్నట్లు సైఫ్ పేర్కొన్నాడు. దీంతో ఆయన స్టేట్‌మెంట్ ఓ వర్గం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ సినిమాలో ఆయనను భాగం చేయకూడదంటూ వారు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పుడు, ఓ రోజు గడిచిన తర్వాత తన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకున్న సైఫ్ ఎవరి మనోభావాలనైనా తాను గాయపరిచి ఉంటే క్షమించమని కోరాడు. "ఓ ఇంటర్వ్యూ సందర్భంగా నేను చేసిన స్టేట్‌మెంట్లలో ఒకటి వివాదానికి కారణమై, ప్రజల మనోభావాలను గాయపరిచిందని తెలిసింది. ఎవరి మనోభావాలనూ గాయపరిచే ఉద్దేశం నాకు లేదు. ప్రతి ఒక్కరికీ సిన్సియర్‌గా అపాలజీ తెలియజేస్తూ, నా స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకుంటున్నా. శ్రీరామ ప్రభును ధర్మానికీ, వీరత్వానికీ ప్రతీకగా నేనెప్పుడూ భావిస్తాను. 'ఆదిపురుష్' అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసే సినిమా. ఎలాంటి వక్రీకరణలు లేకుండా ఆ ఎపిక్‌ను అందించడానికి మొత్తం టీమ్ కలిసి పనిచేస్తోంది" అని ఓ ప్రకటన ద్వారా తెలిపాడు సైఫ్.
![]() |
![]() |