![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాప్ ఫామ్ లో ఉన్నారు. 'పుష్ప: ది రైజ్'తో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్న బన్నీ.. ప్రస్తుతం పుష్ప రెండో భాగంగా రానున్న 'పుష్ప: ది రూల్'తో బిజీగా ఉన్నారు. ఇటీవల 'పుష్ప-1'కి గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు గెలుచుకోవడంతో ఆయన పేరు మారుమోగిపోతోంది. ఎప్పుడూలేని విధంగా ఇన్ స్టాగ్రామ్ టీమ్ హైదరాబాద్ వచ్చి బన్నీపై స్పెషల్ వీడియో తీసిందంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక 'పుష్ప-2' తర్వాత బన్నీ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే పలువురు ఫిల్మ్ మేకర్స్ బన్నీతో సినిమా ఓకే చేయించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి వరకు బన్నీ 'పుష్ప-2'తోనే బిజీగా ఉంటారు. ఆ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ బన్నీతో సినిమా ఓకే చేయించుకోవడానికి దర్శకులు పోటీ పడుతున్నారు.
బన్నీతో సినిమా చేయడానికి పోటీ పడుతున్న దర్శకుల్లో బోయపాటి శ్రీను, అట్లీ ముందు వరుసలో ఉన్నారు అంటున్నారు. బన్నీతో మూవీ చేయాలని బోయపాటి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన 'సరైనోడు' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే వీరి కాంబోపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకుంటున్న బోయపాటి.. అందుకు బన్నీతో సినిమా చేయడమే సరైనదిగా భావిస్తున్నారు. ఆ మధ్య అల్లు అరవింద్ సైతం తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి సినిమా ఉంటుందని అన్నారు. బన్నీ లేదా కోలీవుడ్ స్టార్ సూర్యతో సినిమా చేయాలని బోయపాటికి అరవింద్ సూచించారట. అయితే బోయపాటి మాత్రం బన్నీతోనే మరో మూవీ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట.
ఇక కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కూడా బన్నీతోనే సినిమా చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్ట్ చేసిన 'జవాన్' విడుదలకు సిద్ధమైంది. విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా.. 'పఠాన్' తర్వాత షారుఖ్ కెరీర్ లో మరో వెయ్యి కోట్ల సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలా జవాన్ తో నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిన అట్లీ.. ప్రస్తుతం బన్నీ జపం చేస్తున్నారట. నిజానికి 'జవాన్' లోనే బన్నీతో గెస్ట్ రోల్ చేయించాలని చూశారు అట్లీ. కానీ అది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు బన్నీతో సినిమా విషయంలో మాత్రం గట్టిగా పట్టుబడుతున్నారట. బన్నీకి కథ చెప్పి ఓకే చెప్పించుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారట.
ఓ వైపు తనకు 'సరైనోడు' వంటి హిట్ అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి.. మరోవైపు షారుఖ్ 'జవాన్'తో ట్రెండింగ్ లో ఉన్న సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ.. మరి ఈ ఇద్దరిలో బన్నీ ఎవరికి ఓటు వేస్తారో చూడాలి.
![]() |
![]() |